శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (11:37 IST)

మహిళల ఉద్ధరణకు ఉపాసన కామినేని కొణిదెల విరాళం

Upasana Kamineni
Upasana Kamineni
 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని `హౌస్ ఆఫ్ టాటా` నుండి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. జోయా యొక్క "అరుదైన, కాలాతీతమైన ఆభరణాల" కోసం విలాసవంతమైన గమ్యస్థానాన్ని ప్రారంభించినందుకు ఆమె సంతోషించింది,
 
 అనంతరం ఆమె మాట్లాడుతూ,  ఈ రకంగా వచ్చిన ఆదాయాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (DFVDT)  దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అణగారిన, అట్టడుగున ఉన్న మహిళలను సమగ్రంగా ఉద్ధరించే ఇతర కార్యక్రమాలతోపాటు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఆ ట్రస్ట్ కట్టుబడి ఉంది. అందుకే వారు చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలిపాను అని అన్నారు. ఆమె దాతృత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.