బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:01 IST)

ధనుష్ సినిమాలో వరలక్ష్మీ.. సాయిపల్లవి హీరోయిన్

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న వరలక్ష్మి... తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ధనుష్ హీరోగా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న వరలక్ష్మి... తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ధనుష్ హీరోగా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''మారి-2''లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
 
విక్రమ్ వేదా, సత్య సినిమాల్లో వరలక్ష్మి నటించి.. మంచి గుర్తింపు సంపాందించింది. తాజాగా మారికి సీక్వెల్‌గా రాబోతున్న మారి-2లో నటించే ఛాన్సును కూడా కైవసం చేసుకుంది.

ఈ సినిమాలో వరలక్ష్మి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ మూవీలో ధనుష్ హీరోగా, మలయాళం యాక్టర్ టోవినో థామస్ ప్రతినాయకుని పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. 
 
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలను అందిస్తున్నారు. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.