విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేశారు.
'వెతికా నేనే నా జాడే' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ' వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. "తుఫాన్" సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు