సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (13:31 IST)

భార్య రాధిక ఎన్నికల్లో గెలవాలి.. శరత్ కుమార్ అంగ ప్రదక్షణ

Actor Sarathkumar
Actor Sarathkumar
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఎన్నికల్లో విజయం సాధించాలని విరుదునగర్ ఆది పరాశక్తి మారియమ్మన్ ఆలయంలో ఆమె భర్త, నటుడు శరత్ కుమార్ అంగ ప్రదక్షణ చేశారు. 
 
చేతిలో వేపాకుతో భక్తులు ఆయనపై నీళ్లు పోస్తుండగా అమ్మవారి ఆలయం చుట్టూ శరత్ కుమార్ అంగప్రదక్షణ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా భార్య కోసం, భార్య ఎన్నికల్లో గెలుపొందడం కోసం భర్త అంగ ప్రదక్షణలు చేయడం గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు. 
 
ఇకపోతే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నటి రాధిక శరత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. విరుదునగర్ లోక్ సభ స్థానంలో రాధికకు పోటీగా దివంగత సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమార్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ పోటీ చేస్తున్నాడు. 
 
అలాగే డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు వుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.