ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (14:16 IST)

ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే.. వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు

ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తన ట్వీట్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజయ్ సేతుపతి.. కరోనా ఎఫెక్టుతో తిండి కోసం అలమటిస్తున్న పేదలనుద్దేశించి ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ''ఆకలి కూడా ఓ డిసీజ్ లాంటిదే. దానికి కూడా ఓ వ్యాక్సీన్ కనిపెడితే బాగుండు'' అని ట్వీట్ చేశారు. 
 
కరోనా, లాక్ డౌన్ ఎఫెక్టుతో ఆహారం, నిత్యావసర సరుకులు లేక కూలీలు, కార్మికులు, పేదలు.. నానా ఇబ్బందులు పడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఆకలితో ఉన్నవారికి అవసరమైన వస్తువులు, భోజనం అందిస్తున్నారు.
 
ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ విజయ్ సేతుపతి ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. జీవనోపాధి కోల్పోయిన కోలీవుడ్ టెక్నీషియన్స్‌కు విజయ్ ఇప్పటికే రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.