శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:15 IST)

రజినీ, కమల్‌లు కలిసి పోటీ చేస్తే....

తమిళనాడు రాజకీయాలలోని అధికార పక్షం, ప్రతిపక్షాలలోని రెండు పెద్ద తలలు పోయిన తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖులచే స్థాపించబడి అంతో... ఇంతో... తమకంటూ కొంత అనుభవాన్ని పొందాలనుకుంటున్న రజినీ, కమల్‌హాసన్‌లు... సినీ పరిశ్రమలో పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ మిత్రులు ఇద్దరూ కలిసి పోటీ చేస్తే... బాగుంటుందని జనాలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు...
 
అయితే... ఇలా కోరుకునేవారి జాబితాలోకి త‌మిళ హీరో, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ కూడా వచ్చి చేరాడు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ పార్టీలు క‌లిసి పోటీచేయాల‌ని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. మంచి స్నేహితులైన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లు త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే లోక్‌స‌భ ఎన్నికల్లో క‌లిసి పోటీ చేస్తే త‌మిళ‌నాడుకు మంచి జ‌రుగుతుంద‌ని విశాల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.
 
'ర‌జినీ సార్‌, క‌మ‌ల్ సార్ క‌ల‌వాల‌ని కోరుకుంటున్నాను. న‌డిగ‌ర్ సంఘం షో కోసం కాదు.. ఏదైనా స్టార్ రిసెప్ష‌న్ కోసమో.. మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసమో కాదు.. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వీరు క‌లిసి పోటీ చేయాలి. వీరు క‌లిస్తే ఇక తిరుగుండదు. మొత్తం మారిపోతుంద‌'ని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.