మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (12:26 IST)

ఆర్ఆర్ఆర్ ఫీవర్.. నాటు నాటు పాటకు ఓరి దేవుడా హీరోయిన్స్ స్టెప్పులు

rrrmovie
ఆర్ఆర్ఆర్ ఫీవర్ తగ్గట్లేదు. రిలీజై నెలలు గడుస్తున్నా.. ఇందులోని నాటు నాటు సాంగ్‌కు క్రేజ్ తగ్గలేదు. ఇందులో సిగ్నేచర్ స్టెప్ బాగా పాపులర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం జపాన్‏లో స్క్రీనింగ్ అవుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. 
 
అలాగే నాటు 
చిన్న.. పెద్ద తేడా లేకుండా నాటు నాటు సాంగ్ సిగ్నేచర్ స్టెప్పుకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. తాజాగా ఓరి దేవుడా మూవీ హీరోయిన్స్ కూడా ఈ పాటకు అందంగా స్టెప్పులేశారు. ఓరి దేవుడా మూవీ సక్సెస్ సంబరాల్లో భాగంగా.. హీరోయిన్స్ మిథాలా పాల్కర్.. ఆశా భట్ కలిసి ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. 
 
మిథాలా చీరలో.. ఆశా భట్ లెహాంగాలో దీపావళి కాంతుల్లో నాటు నాటు లెగ్ స్వింగ్ స్టెప్పులేశారు. ఈ వీడియోను మిథాలా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. నాటు నాటు విత్ మై పార్టనర్ ఇన్ క్రైమ్..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
 
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. మిథాలా పాల్కర్ జంటగా నటించిన ఓరి దేవుడా చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

RRR
RRR