సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (12:48 IST)

అక్టోబర్ 31 లేడీస్ నైట్ : విశ్వక్‌సేన్‌తో రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు మరో ఛాన్స్ వచ్చింది. యువ నటుడు విశ్వక్‌సేన్‌తో కలిసి అక్టోబర్ 31 లేడీస్ నైట్‌ అనే చిత్రంలో నటించనుంది. ఇది కేవలం ఓటీటీ కోసమే తెరకెక్కిస్తున్నారు. 
 
సాధారణంగా ఇదివరకు కథానాయికలు ఒక సినిమా తర్వాత మరో సినిమాలో అవకాశం వస్తే తేలికగా ఊపిరి పీల్చుకునేవారు. సినిమా ఫీల్డ్‌లో గ్యాప్ రాకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఒక రేంజ్ వాళ్లు టెన్షన్ పడేవారు. 
 
ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు కాస్త లేట్‌గా వచ్చిన ఫరవాలేదు .. ఓటీటీలు ఉన్నాయి కదా అని తాపీగా ఉన్నారు. చాలామంది కథానాయికలు ఇప్పుడు ఓటీటీ సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో తీరిక లేకుండా ఉన్నారు. వెబ్ సిరీస్‌లు చిన్న చిన్న కథలుగా రూపొందుతుండటం మరింత మంది ఆర్టిస్టులకు అవకాశాన్ని ఇస్తోంది.
 
ఓటీటీ కోసం ప్రస్తుతం 'అక్టోబర్ 31 .. లేడీస్ నైట్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఆంథాలజీ ఫిల్మ్‌కి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. మిగతా కథానాయికలతో పోల్చుకుంటే ఈ రూట్లో రకుల్ కాస్త ఆలస్యంగానే అడుగుపెట్టింది. 
 
విష్వక్‌సేన్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. అతని పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంటున్నారు. అలాగే రకుల్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఓటీటీ రూట్లో రకుల్ బిజీ అవుతుందేమో చూడాలి.