ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:35 IST)

ఆ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ?

war2movie
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి "వార్-2" చిత్రంలో యంగ్ టైగర్ నటించనున్నట్టు సమాచారం. రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్' చిత్రంలో తారక్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంటీ ఇస్తున్నారు.
 
అదేసమయంలో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారైంది. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన "వార్-2" చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి 2019లో వార్ తొలి భాగం వచ్చింది. దీనికి సీక్వెల్‌గా మరో చిత్రం రానుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు కలిసి నటించనున్నట్టు వార్తలు గప్పుమన్నాయి. 
 
అలాగే, 'వార్' మొదటి చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, రెండో భాగానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయాన్ ముఖర్జీ ఇటీవలే "బ్రహ్మాస్త్ర" చిత్రాన్ని డైరెక్ట్ చేసిన విషయం తెల్సిదే. ఈ కాంబినేషన్‌ ఇప్పటి నుంచే పెద్ద ఆసక్తిని రేపుతోంది.