ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (06:30 IST)

నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా : జూనియర్ ఎన్టీఆర్

'నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను'.. అంటూ తండ్రి నందమూరి హరికృష్ణతో హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. బాబీ దర్శకత్వంలో తాను నటించిన తాజా చిత్రం ‘జై లవ

'నాన్నా.. మీ రుణం మరో జన్మలో తీర్చుకుంటా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను'.. అంటూ తండ్రి నందమూరి హరికృష్ణతో హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. బాబీ దర్శకత్వంలో తాను నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ చిత్రం కథ విన్న తర్వాత అద్భుతంగా ఉందని బాబీకి చెప్పాను. ఆ తర్వాత ఈ కథ గురించి ఇద్దరు వ్యక్తులతో పంచుకున్నాను. వాళ్లిద్దరూ కూడా ‘కథ చాలా బాగుంది’ అని చెప్పారు. 
 
ఈ సినిమా కథ మీకు కూడా నచ్చుతుందని.. బాగుంటుందని.. హిట్టవుతుందని నా నమ్మకం... ఈ చిత్రం తప్పకుండా మన గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం నాకుంది... ‘ఈ సినిమా చూసి ఎంత బాగా తీశారని అభిమానులు అనుకోవాలి... తల్లిదండ్రులూ అనుకోవాలి' అన్నారు.
 
ఇక ‘జై లవ కుశ’ సినిమా కేవలం ‘జై’ ఒక్కడి సినిమా కాదండి. ఈ చిత్రం జై, లవ, కుశ.. ఈ మూడింట్లో ఏ ఒక్క పేరు పోయినా కరెక్టవదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరు కూడా స్ఫూర్తి పొందుతారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని హీరో చెప్పారు. 
 
అలాగే, ఈ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘జై లవ కుశ’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించడానికి కారణం తన పెద్ద కొడుకు జానకిరామ్ అని చెప్పారు. ‘ఓ రోజు జానకిరామ్ బాబు.. కళ్యాణ్ రామ్ బాబుతో ఏమన్నాడంటే.. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరు పెట్టుకోవడం కాదు, ఈ బ్యానర్‌పై తమ్ముడితో సినిమా చేయాలి’ అని అన్నాడు. అప్పుడే, ‘జై లవ కుశ’ సినిమాకు బీజం పడింది’ అని చెప్పుకొచ్చారు. ‘జై లవ కుశ’లో ‘జై’ పాత్ర తనకు నచ్చిందని, ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నవ్వు చూస్తుంటే.. నాడు సీతారామ కళ్యాణం చిత్రంలో తన తండ్రి నవ్వు గుర్తుకు తెస్తోందని అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని హరికష్ణ అన్నారు.