1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 మే 2022 (12:54 IST)

ఎఫ్‌3లో హీరోల‌కు మేన‌రిజం క్రియేట్ చేసి ఫ‌న్ తెప్పించిన అనిల్ రావిపూడి

F3 trailer poster
F3 trailer poster
విక్టరీ వెంకటేష్,  వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఎఫ్ 3’ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. డ‌బ్బుకు ప్రాధాన్య‌త ఇచ్చే క‌థ‌తో ఈ చిత్రం రూపొందింది. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా విడుద‌ల‌కాబోతోంది.
 
ఈ ట్రైల‌ర్ ఎలా వుందంటే, 
‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు, కానీ ఆరో భూతం ఒకటి ఉంది, అదే డబ్బు…అంటూ ట్రైలర్ మొదలై.. చివర్లో అంతేగా అంతేగా అంటే.. ఈడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా ? అంటూ ట్రైలర్ ముగించడం విశేషం. ఇక మ‌ధ్య‌లో వ‌రుణ్‌తేజ్‌కు న‌త్తి, వెంక‌టేష్‌కు రేచీక‌టి వున్న‌ట్లు చూపించ‌డం విశేషం. డ‌బ్బుకోసం ఆశ‌ప‌డే పాత్ర‌లు, తుపాకి ఫైరింగ్ చేసే అలీ పాత్ర‌లు క‌నిపిస్తాయి. 
 
ఫుల్ ఫ‌న్ క్రియేట్ చేస్తూ తీసిన ఈ సినిమాకు  దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందించారు. త‌మ‌న్నా, మెహ్రిన్ హీరోయిన్టుగా న‌టించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.