శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (10:41 IST)

షూస్‌లో పాము.. వీడియో వైరల్

Snake
Snake
వర్షాకాలం ఆరంభమైంది. చెప్పుల స్టాండులో పురుగులుంటాయి జాగ్రత్త. ఇంకా పాములు ఇతరత్రా పురుగులతో అప్రమత్తంగా వుండాలి. 
 
ఎందుకంటే.. తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. 
 
వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి సదరు మహిళ పామును పాదరక్షల నుంచి బయటకు తీశారు.
 
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపామును వీడియో తీసి ఈ చిన్న క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
 
షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లక్ష కంటే అధికంగా నెటిజన్లు వీక్షించడంతోపాటు 3,400 మంది లైక్ చేశారు.