శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (15:06 IST)

ఎదగడానికి కాంప్రమైజ్... ఎదిగాక #MeToo : ఎమ్మెల్యే ఉషా ఠాకూర్

#MeToo ఉద్యమం దేశంలో ఓ స్థాయిలో వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయా రంగాల్లో పనిచేస్తున్న మహిళల్లో కొందరు తమకు ఎదురైన చేదు అనుభవాలను వరుసగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను వేధించారంటూ పలువురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు నటులు షూటింగులకు రావడంలేదు. మరికొందరు తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారు. 
 
ఐతే దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌లో ఎదుగుదల కోసమో లేదంటే సొంత ప్రయోజనాల కోసమో కొందరు మహిళలు ఆ విషయంలో రాజీ పడతారంటూ చెప్పుకొచ్చారు. చేస్తున్న ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో వున్నత స్థానానికి వెళ్లేందుకు మహిళల్లో కొందరు విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తుంటారని వ్యాఖ్యానించారు. అలా ఆనాడు ప్రయోజనాలు పొందేసి తీరా పైకి వచ్చాక మీ టూ అంటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారటంటూ ఆరోపించారు. 
 
ఈ నేపధ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత మహిళలు. కానీ సదరు ఎమ్మెల్యే ఉష మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు.