శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (23:06 IST)

వారెవ్వా డేవిడ్ వార్నర్, 'తగ్గేదే లె' అంటూ అల్లు అర్జున్ కామెంట్, ఎందుకో తెలుసా?

క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ క్రికెట్ వేరయా. బ్యాట్ ఝుళిపించడమే కాదు... మాస్ హీరోల పాటలను ఆట్టే పట్టేసి వాటిని ట్రెండ్ చేయడంలో డేవిడ్ వార్నర్ లాంటి డైనమిక్ ఆటగాడు మరెవరూ వుండరనుకోవచ్చు. ఆమధ్య అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఈ ఆటగాడు ఇప్పుడు పుష్పరాజ్ పైన గురిపెట్టాడు.

 
గెడ్డం, జుత్తు, నుదుటున ఎర్రని బొట్టు పెట్టుకుని పూలపూల చొక్కాలో పుష్పరాజ్ అవతారం ఎత్తాడు. అంతేనా... ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి ఇరగదీశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 
డేవిడ్ వార్నర్ ఏయ్ బిడ్డా పాటకు డ్యాన్స్ చూసిన కోహ్లి సైతం ప్రశంసలతో ముంచెత్తాడు. అల్లు అర్జున్ మాత్రం ‘వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే’ అంటూ కామెంట్ చేసాడు. విషయం ఏంటంటే ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. దటీజ్ వార్నర్ బ్రదర్.