శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (08:27 IST)

'సంతోష'మా నీవెక్కడ? బూతద్దంలో వెతుకుతున్న భారతీయులు.. పాక్ - లంక మనకంటే బెటర్

depression
భారతీయుల జీవితాల్లో సంతోషం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అది ఎంతలా అంటే పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక ప్రజల కంటే తక్కవగా భారతీయులు సంతోషంతో గడుపుతున్నారు. ప్రపంచంలో అత్యంత సంతోషమయ దేశాల్లో భారత్ స్థానం మరింతగా దిగజారిపోయింది. పాకిస్థాన్, శ్రీలంక దేశాల కంటే ఈ స్థానం మరింతగా తక్కవకు చేరుకుంది. అయితే, ప్రచంచ దేశాల్లో అత్యంత సంతోషమయ దేశాల్లో ఉత్తర యూరప్ దేశాలు సత్తా చాటాయి. ఫిన్లాండ్ ఏకంగా 10 పాయింట్లకు గాను 7.8 పాయింట్లను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆప్ఘనిస్థాన్ దేశం 1.8 పాయింట్లతో అత్యంత దుఃఖమయ దేశాల జాబితాలో అట్టడుగున నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2023 పేరుతో ఐక్యరాజ్య సమితి ఈ జాబితాను తయారు చేసింది. ఇందులో 137 దేశాల్లో లక్షమందిని సర్వే చేసి ఫలితాలను విడుదల చేసింది. 
 
అయితే, భారత్ అన్ని రంగాల్లో దూసుకునిపోతుందంటూ ప్రచారం ఊదరగొడుతున్నారు. కానీ వరల్డ్ హ్యాపీయస్ట్ దేశాల జాబితాలో భారత్ స్థానం చూస్తే జాలివేస్తుంది. మొత్తం 135 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా ఇందులో భారత్‌కు కేవలం నాలుగు పాయింట్లు సాధించి ఆప్ఘనిస్థాన్ దేశానికి చేరువగా 126 స్థానంలో నిలించింది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలు మనకంటే మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. గత యేడాది భారత్ 136 స్థానంలో నిలువగా ఈ దఫా 126వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌కు 108, బంగ్లాదేశ్‌కు 118, మయన్మార్‌కు 117, శ్రీలంకకు 112 స్థానాలు దక్కించుకున్నాయి. 
 
ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉన్న ఫిన్లాండ్ పాలకులు మాత్రం తమ దేశ ప్రజలకు కష్టసుఖాల్లో అండగా నిలబడి, వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటూ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఫలితంగా వరుసగా ఆరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 7.8 పాయింట్లతో డెన్మార్క్ రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 47వ స్థానంలో నిలువగా చైనా 64, నేపాల్ 78, ఉక్రెయి్ 92 స్థానాల్లో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా 15 స్థానంలో నిలిచింది.