శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2024 (23:16 IST)

మద్దతు లేఖ ఇచ్చిన NDA మిత్రపక్షాలు: నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడి

Babu-Modi-Pawan
లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపధ్యంలో NDA నాయకుడిగా నరేంద్ర మోదీని తదుపరి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోడీ తన కొత్త మంత్రివర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన ప్రకటనలో శ్రీమతి ముర్ము ఇలా తెలిపారు. వివిధ మద్దతు లేఖల ఆధారంగా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి... కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభలో మెజారిటీ మద్దతుని పొందే స్థితిలో ఉందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో ఉందని పేర్కొన్నారు.
 
A letter stating that Narendramodi had been elected leader of the BJP Parliamentary Party
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోదీ మూడు పర్యాయాలు ప్రధానమంత్రి కానున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉదయం ఎన్‌డీఏ మిత్రపక్షాలన్నీ నన్ను నాయకుడిగా ఎన్నుకుని రాష్ట్రపతికి తెలియజేశాయి. ఆ తర్వాత రాష్ట్రపతి నన్ను పిలిచి ప్రధానిగా ప్రమాణం చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. ఎన్డీయేకు మూడోసారి అధికారం ఇచ్చినందుకు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.