సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (14:48 IST)

Operation Arikomban: 3 రోజులైనా చిక్కకుండా చుక్కలు చూపిస్తోంది..

Arikomban
Arikomban

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. అరికొంబన్‌ గత 5 ఏళ్లలో 18 మందిని చంపింది. 
 
ఇంకా చాలా వ్యవసాయ భూమిని నాశనం చేసింది. గత నెలలో అరికొంబన్‌ను పట్టుకున్న కేరళ అటవీ శాఖ దానిని తేక్కడి సమీపంలోని మేధకానం అడవుల్లో వదిలిపెట్టింది. అక్కడి నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ తేని జిల్లా కంబం ప్రాంతంలోకి ప్రవేశించింది. 
 
ఈ అరికొంబన్‌ను అడవిలోకి తరిమికొట్టేందుకు అటవీశాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం అరికొంబన్‌ను అడవిలోకి పంపేందుకు మావటిలు, 150 మంది ఫారెస్ట్ గార్డు బృందం రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వుండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.