మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 నవంబరు 2019 (18:06 IST)

ఈ శుక్రవారం నుంచి ఇక 'జబర్దస్త్'లో కనబడను, దాని సంగతి తర్వాత చెప్తా: నాగబాబు

జబర్దస్త్ కామెడీ షో గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ వుంది. ఈ షో నుంచి వరుసగా ఒక్కొక్కరూ బయటకు వెళ్లిపోతున్నారు. రాజకీయ కారణాల రీత్యా ఆర్కే రోజా నిష్క్రమించారు. తాజాగా నాగబాబు కూడా షో నుంచి తప్పుకున్నట్లు ఆయనే స్వయంగా తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఈరోజు శుక్రవారం ఎపిసోడ్ నుంచి ఇకపై జబర్దస్త్ షోలో కనబడనని చెప్పారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నాకు ప్రతి గురు, శుక్రవారాలు చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్‌ నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. బిజినెస్‌కు సంబంధించిన ఐడియాలాజికల్‌ విభేదాల వల్ల బయటకు రావాల్సి వచ్చింది. ఇందులో ఎవరి తప్పు లేదు.
 
జబర్దస్త్‌ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డికి ఈ సందర్భంగా థ్యాంక్స్‌. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గట్లు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. దీని గురించే నేను బయటకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అందులో వాస్తవం లేదు. జబర్దస్త్‌లో నా జర్నీ ఎలా మొదలైందో, ఎలా క్లోజ్‌ అయిందనేది తర్వాత చెపుతాను" అని నాగబాబు వెల్లడించారు.