జిమ్‌లో వ్యాయామం చేస్తుంటే వీడియో తీసి మార్ఫింగ్ చేసారు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రండి: వైసిపి ఎంపి నగ్న వీడియోపై సవాల్
వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ నగ్నంగా వున్నారనీ, ఓ మహిళతో మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసిపి ఎంపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
తను జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసారనీ, దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను ఎవరు అప్ లోడ్ చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఇలాంటి చౌకబారు వ్యవహారాలు కాకుండా ఏదైనా వుంటే ఫేస్ టు ఫేస్... దమ్ముంటే తన ముందుకు రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తనపై చేస్తున్న కుట్రలో ఇదో భాగమని ఆరోపించారు. అప్ లోడ్ చేసిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబుకి పంపి తనపై బురద జల్లుతున్నవారి భరతం పడతామంటూ వెల్లడించారు.