మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (11:00 IST)

'మిస్ ఇండియా' రన్నరప్‌గా తెలుగమ్మాయి... విజేత ఎవరు?

మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌

మిస్ ఇండియా రెండో రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రేయారావ్ కామవరపు నిలిచింది. అలాగే, మిస్ ఇండియా విజేతగా తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ ఎంపికకాగా, మొదటి రన్నరప్‌గా హర్యానా రాష్ట్రానికి చెందిన మీనాక్షి చౌదరి ఎంపికైంది. దీంతో మిస్ వరల్డ్ 2018 పోటీల్లో భారత తరపున అనుక్రీతి పాల్గొనబోతుంది.
 
మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలు మంగళవారం రాత్రి ముంబైలోని అట్టహాసంగా జరిగింది. ఇందులో క్రికెటర్లు ఇర్ఫన్ పఠాన్, కేఎల్ రాహుల్, ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా, బాలీవుడ్ నటి మలైకా అరోరా, నటులు బాబీ డియోల్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటీమణులు మాధురీ దీక్షిత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.