ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:20 IST)

తెల్లజుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఆ పౌడర్‌ను హెన్నాతో కలిపి వాడితే...

ప్రస్తుత ఆధునిక యుగంలో అందరినీ వెంటాడుతున్న సమస్యలు బట్టతల ఒకటి. రెండోది చిన్నవయస్సులో జుట్టు తెల్లబడటం. ఒకప్పుడు వయస్సు మళ్లిందనడానికి సూచికగా కనిపించే తెల్లజుట్టు ఇప్పుడు చాలా చిన్నవయస్సు నుండే కనిపిస్తోంది. మోడర్న్ లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలతో చిన్నపిల్లల నుండి యుక్తవయస్సువారి వరకు అందరూ తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ముసలివాళ్లలా కనిపించడం ఇష్టంలేని చాలామంది డైలతో తెల్లజుట్టును కవర్ చేస్తుంటారు. అయితే ఇందులో వాడే రసాయనాల వలన జుట్టు రాలడంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. అటువంటి వారికి ఇండిగో పౌడర్ వరమనే చెప్పాలి.
 
ముందుగా నీటిని వేడి చేసి, అందులో రెండు స్పూన్ల టీపౌడర్ వేసి డికాషన్ తయారు చేసుకోవాలి. ఇంకో బౌల్‌లో రెండు స్పూన్ల ఇండిగో పౌడర్ తీసుకుని, సరిపడే డికాషన్ కలుపుతూ పేస్ట్ తయారు చేసుకోవాలి. అందులో మరో 2 టీస్పూన్ల హెన్నా పౌడర్ వేసుకుని, బాగా కలిపి పేస్ట్‌లాగా చేసుకుని, తలస్నానం చేయడానికి గంట ముందు కుదుళ్లకు పట్టేలా తలకు అప్లయ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేచురల్ షాంపూతో తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు సమస్య నుండి బయటపడవచ్చు, పైగా ఇది పూర్తిగా నేచురల్ కాబట్టి రసాయన ప్రభావం మీపై పడదు.