శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:21 IST)

మసాజ్‌ సెంటరు పేరుతో వ్యభిచారం.. దంపతుల అరెస్టు

చెన్నైలోని ఓ మసాజ్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ప్రైవేట్ అపార్టుమెంట్‌లో సాగుతూ వచ్చింది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్టుమెంటులో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, రాత్రి సమయంలో అధిక సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి తేనాంపేట పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సాధారణ దుస్తుల్లో సంబంధిత మసాజ్‌ సెంటర్‌ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్‌ సెంటర్‌ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచారం కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్‌ సెంటర్‌ యజమాని సెంథిల్‌ (37), అతని భార్య శాంతి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు.