ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (14:14 IST)

పెళ్లైంది కదా అని పెళ్లాంపై పెత్తనం చెలాయిస్తున్నారా? బీ కేర్ ఫుల్ గురూ..! టిప్స్ ఇవిగోండి..!

పెళ్లైంది కదా అని పెళ్లాంపై పెత్తనం చెలాయించే పురుషులు వేలకు వేలున్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించినా.. పురుషాధిక్యం కారణంగా మహిళలకు ఇంట్లోనూ తిప్పలు తప్పట్లేదు. ఉద్యోగం చేస్తున్న

పెళ్లైంది కదా అని పెళ్లాంపై పెత్తనం చెలాయించే పురుషులు వేలకు వేలున్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించినా.. పురుషాధిక్యం కారణంగా మహిళలకు ఇంట్లోనూ తిప్పలు తప్పట్లేదు. ఉద్యోగం చేస్తున్న మహిళలైనా, గృహిణీలు అయినా వారికి తగ్గట్టు పనులుంటాయి. గృహిణీలు ఇంట్లో ఉంటూ అని పనులు చేసుకుంటే.. ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి పనులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఉద్యోగం చేసేవారికి కొందరు పురుషులు ఇంట్లో ఉపకరిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం పెత్తనాన్ని తగ్గించట్లేదు. ఇంట్లో భార్య ఎంత పనిచేసినా వారికి సంతృప్తి ఉండదు. ఇంటి పనిని షేర్ చేసుకోరు. వారి పని వారు చేసుకుంటూ పోతారు. ఉద్యోగం ముగించి ఇంటికొస్తే టీవీ, కంప్యూటర్లు, మొబైళ్లకు అతుక్కుపోతారు. పిల్లల పెంపకం, ఇంటిపని, ఉద్యోగం వంటివి అన్నీ మహిళలే చూసుకుంటారు. అలాంటి కుటుంబాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి. 
 
అయితే ప్రస్తుతం మహిళలు మాత్రం బోల్డ్‌గా పురుషులను డీల్ చేస్తే దారికొస్తారని మానసిక నిపుణులు అంటున్నారు. భర్తలతో నోరిచ్చి తిట్టించుకోవడం కంటే మాటతీరుతో వారిని దారికి తీసుకోవాలంటున్నారు. అలా కుదరకపోతే సైలెంట్‌గా వారికీ పనులు కేటాయించి.. ఇంటి పనుల్లో దించాలంటున్నారు. ఇదే మంత్రాన్ని పడకగదిలో కొనసాగిస్తే.. ఇక పురుషాధిక్యానికి ఇంట్లో తూట్లు పొడిచినట్లేనని వారు సూచిస్తున్నారు. 
 
ఇంటిని చక్కదిద్దుకునే సత్తా మహిళల్లో ఉంటే తప్పకుండా ఇతర రంగాల్లో రాణించడం సులువవుతుందని మానసిన నిపుణులు అంటున్నారు. ఇంటి పరిస్థితి సాఫీగా సాగిపోతే.. ఉద్యోగాల్లో తమ ప్రతిభను బయటికి తెచ్చే విధంగా ఆలోచించే దృక్పథం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. అలాగే పగలంతా మాటలతో వేధించి రాత్రయ్యే సరికి నాలుగు మంచి మాటలు మాట్లాడితే వదిలేయండి. అదే తంతును పడకగదిలోనూ కొనసాగిస్తే మాత్రం.. సహనం, ఓర్పుతో సర్దుకోండి. వేధింపులు మరీ ఎక్కువైతే మాత్రం తిరగబడండని మానసిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.