బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (15:00 IST)

స్మార్ట్‌ఫోన్ల పక్కనే నిద్రపోతే మహిళల్లో గర్భస్రావం..

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్

యువతులు, మహిళలు స్మార్ట్ ఫోన్లు తెగ వాడేస్తున్నారా...? అయితే ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే? స్మార్ట్ ఫోన్ల రేడియేషన్‌తో గర్భస్రావం జరిగే అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా.. మైక్రోవేవ్‌, వైఫై రౌటర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో మహిళల్లో అధికంగా గర్భస్రావం జరిగే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అందుకే స్మార్ట్ ఫోన్లను మహిళలు అధికంగా వాడకూడదని.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
 
అయితే మహిళలు రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే.. స్మార్ట్ ఫోన్లకు దూరంగా వుండాలి. నిద్రించేటప్పుడు బెడ్‌కు దూరంగా స్మార్ట్ ఫోన్లను వుంచాలి. స్మార్ట్ ఫోన్లలో మాట్లాడేటప్పుడు స్పీకర్లను, హెడ్ సెట్లను ఉపయోగించాలి. అలాకాకుండా నిద్రించేటప్పుడు స్మార్ట్ ఫోన్లను పక్కనబెట్టుకోవడం చేస్తే గర్భస్రావాలు, కేన్సర్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.