మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (12:28 IST)

అత్యాచార బాధితురాలికి పెళ్లి కుదిరింది.. అయినా ఆ వీడియోలు..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు ఓవైపు, వేధింపులు మరోవైపు మహిళలను వెంటాడుతూనే వున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్ప

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు ఓవైపు, వేధింపులు మరోవైపు మహిళలను వెంటాడుతూనే వున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆ ఉదంతాన్ని వీడియో తీసి వేధింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఎన్నారై కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిని రేప్ చేసి, వీడియోలు తీసిన కేసులో అరెస్ట్ చేసిన నిందితులను విచారించారు. 
 
పోలీసుల విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆ అమ్మాయిని బెదిరించి, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి.. డబ్బు, బంగారు గొలుసును నిందితులు నొక్కేశారని తెలిసింది. వీరి వేధింపులు తల్లిదండ్రులకు చెప్పలేక ఆ విద్యార్థిని కుమిలిపోయింది. 
 
ఆపై బాధితురాలికి వివాహం కుదిరినా.. వేధింపులు ఆరంభమైనాయని.. తామడిగినంత డబ్బిచ్చి, కోరిక తీర్చకుంటే కాబోయే భర్తకు వీడియోలు చూపిస్తామని బెదిరించారని వెల్లడించారు. చెప్పినట్లే విద్యార్థినిపై అత్యాచారానికి సంబంధించిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యిందని పోలీసులు తెలిపారు. దీనిపై వాటిని తొలగించని గ్రూప్ అడ్మిన్లపై కేసు పెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.