శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (13:15 IST)

కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం: నలుగురు మృతి

ఏపీలోని కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నలుగురు కలిసి శుక్రవారం బావిలోని మట్టి తీసేందుకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగింది. 
 
వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా, ఇద్దరు బంటుమిల్లి బిఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందిన వ్యక్తి అని స్థానికులు తెలిపారు. 
 
మృతులు రామారావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, రంగాగా గుర్తించారు. వీరంతా  బావిలోని పూడిక మట్టి తీసేందుకు వెళ్లి.. ఊబిలో కూరుకుపోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.