మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (14:49 IST)

పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత గోరంట్ల!

gorantla
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరీ అంతగా ఊహించుకోవద్దని ఆయన హెచ్చరించారు. 
 
వచ్చే 2024లో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి జనసేన - బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు. అయితే, తమతో చేతులు కలిపే విషయంపై టీడీపీ నేతలే ఆలోచన చేయాలంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
దీనిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తన బలంపై పవన్ అతిగా ఊహించుకుంటున్నారన్నారు. సాధారణంగా కింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొంత ధాన్యం అవసరం అవుతుంది. కానీ, ఆ ధాన్యం వల్లనే మొత్తం కాటా తూగుతుందని అనుకుంటే ఎలా? అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఇపుడు ఈ ట్వీట్‌పై ఏపీలో రాజకీయ రచ్చ సాగుతోంది. 
 
ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ దిశంగానే టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇపుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.