1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: మంగళవారం, 20 డిశెంబరు 2022 (16:00 IST)

అవినీతి అంటే నచ్చదు - వైకాపా నేతలంతా ఆర్థికంగా చితికిపోయారు.. మంత్రి ధర్మాన

dharmana prasada rao
వైకాపాలోని నేతలంతా ఆర్థికంగా చితికిపోయారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పైగా, తామంతా అవినీతికి దూరంగా ఉన్నామంటూ సెలవిచ్చారు. అవినీతి రహిత సమాజం కోసం ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు అంటారా అని మండిపడ్డారు. 
 
శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, తనకు అవినీతి అంటేనే నచ్చదన్నారు. పైగా, ఒక్క నయాపైసా అవినీతికి పాల్పడినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. తనను గెలిపించిన ప్రజలను తలదించుకునే పరిస్థితి ఏనాడూ చేయనన్నారు. 
 
ఉద్యోగులు కూడా అవినీతికి దూరంగా ఉండాలని కోరారు. పార్టీలోని నేతలందరూ ఆర్థికంగా చితికిపోయారని, అయినప్పటికీ ఎక్కడా కూడా ఒక్క పైసా అవినీతికి పాల్పడటం లేదన్నారు. అవినీతి లేని సమాజం రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మార్పు తీసుకుని రావాలనే జగన్ వంటి నేతలు కఠినంగా ఉంటారని, అలాంటి వ్యక్తిని నానా మాటలు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు.