మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:34 IST)

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవి

వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి కేంద్రంలో కీలక పదవి వరించింది. పార్లమెంటులో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఆయన పేరు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 
 
ఈయనతో పాటు.. మరో సభ్యుడిగా బీజేపీకి చెందిన సుధాంశు త్రివేది కూడా ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరిద్దరి ఎన్నికను రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ అధికారికంగా ప్రకటించారు. 
 
కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కీలక పాత్ర వహిస్తుంది. ఇలాంటి పదవీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి రావడం గమనార్హం. వైకాపా ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు దక్కుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రం ఈ పదవిని కట్టబెట్టడం గమనార్హం.