ఇండిగోపై కేసు వేస్తా.. ఆకాశంలో తిప్పి.. రూ.5వేలు అడుగుతారా?: రోజా
రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఈ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
ఈ విమానం గంటపాటు గాల్లోనే తిరిగింది. ఆపై ల్యాండ్ అయినా.. ఎవర్నీ విమానం నుంచి దించలేదు. ఈ ఘటనపై రోజా ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై మండిపడ్డారు. ఇండిగో తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని రోజా తెలిపారు. బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని చెప్పారు. తమను ఇంత క్షోభకు గురిచేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.