సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:38 IST)

వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ : నారా లోకేశ్

nara lokesh
వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ సారథ్యంలోని దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడూతూ, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇంకా ఎన్నాళ్లు అరాచాక పాలన సాగిస్తారని ఆయన నిలదీశారు. ముందస్తు ఎన్నికలు వస్తే మూడు నెలలు, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరు నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైకారా అరాచక పాలన అంతం కావడం ఖాయమని చెప్పారు. 
 
మహా నియంతలే మట్టిలో కలిసిపోయారని, ఇక మీరెంత అని ధ్వజమెత్తారు. మీ అధికార మదం ఎలా ఉందంటే ఐటీ ఉద్యోగులు ర్యాలీని కూడా అడ్డుకునే స్థితికి దిగజారి పోయారని మండిపడ్డారు. రాష్ట్ర సరిహద్దులను ఇండోపాక్ సరిహద్దులుగా మార్చివేశారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే మహిళలు అని కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధించారన్నారు. ప్రభుతక్వ అరాచకాలను ప్రశ్నిస్తే నిర్బంధమా?, ప్రజా తిరుగుబాటు అణచివేయాలని చూస్తే ఉద్యమం అవుతుందని ఆయన హెచ్చరించారు. 
 
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం విచారణ వాయిదా  
 
తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అక్రమ కేసును కొట్టి వేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ తేదీని మాత్రం మంగళవారం ఖరారు చేస్తామని తెలిపింది. ఈ పిటిషన్‌ను అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన వినతి మేరకు మంగళవారం విచారణ తేదీని ఖారరు చేస్తామని తెలిపింది.
 
కాగా, శనివారం సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. చంద్రబాబు పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోర్రు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా విచారించాలని విన్నవించారు. ఈ క్రమంలో పిటిషన్‌ను రేపు ప్రస్తావించడానికి ధర్మాసనం అనుమతించింది. దీంతో విచారణ తేదీని రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. 
 
మరోవైపు చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని సిద్ధార్థ లూథ్రాను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీన అరెస్టు చేశారని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో రేపు మెన్షన్ లిస్టు ద్వారా కోర్టుకు రావాలని లుథ్రాకు సీజేఐ సూచించారు.