సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (16:58 IST)

3 రాజధానులకే మా పార్టీ మద్దతు, అసెంబ్లీలో రాపాక, బల్లలు చరిచిన వైకాపా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 రాజధానులను కోరుకుంటున్నారనీ, తను 13 జిల్లాల వ్యాప్తంగా చూసినప్పుడు ఏ ప్రాంతంలోనూ వ్యతిరేకత లేనే లేదని జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెల్లడించారు. 3 రాజధానులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్రాభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయం బ్రహ్మాండమైనదని చెప్పగానే వైకాపా ఎమ్మెల్యేలంతా సభలో పెద్దపెట్టున బల్లలు చరిచి తమ మద్దతు తెలిపారు. చూడండీ రాపాక ప్రసంగం...