గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (19:02 IST)

ధూళిపాళ్ల నరేంద్రతో పాటు 93 మందిపై కేసు

dhulipalla
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైంది. పెదకాకానిలోని మల్లేశ్వర ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండారంటూ.. టిడిపి నేతలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ధూళిపాళ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడంతో పాటు అనుమతి లేకుండా కార్యాలయంలోనికి వచ్చారని దేవాదాయశాఖ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పెదకాకాని పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 93 మందిపై కేసు నమోదు చేశారు.