శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (17:46 IST)

విరిగిపోయిన పులిచింతల గేటు దొరికిందోచ్...

నీటి ప్రవాహానికి విరిగిపోయిన గేటు ఎట్టకేలకు లభించింది. ఈ నెల 5న ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో అధికంగా ఉండటంతో గేటును కొంతమేర పైకి ఎత్తే క్రమంలో గాటర్స్​లో సాంకేతిక సమస్య వల్ల 16 నంబర్ గేటు విరిగి ఊడిపోయింది. 
 
దీనికోసం అధికారులు గాలించారు. కానీ లభ్యం కాలేదు. అయితే, వరద నీటి ఉధృతి తగ్గడంతో ఆ గేటు లభ్యమైంది. ప్రాజెక్టు స్పిల్‌ వేకు 800 మీటర్ల దూరంలో విరిగిపడిన క్రస్టు గేటును అధికారులు గుర్తించారు. క్రస్ట్ గేటును నది నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్‌గేట్ల ఏర్పాటు కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఇంజినీరింగ్‌ నిపుణులు నాలుగు గేట్లను ఏర్పాటు చేశారు. గేట్ల ఏర్పాటు పనులను ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు.