చంద్రబాబుకు పట్టిన గతే మమతకు పడుతుంది... కృష్ణం రాజు

krishnamraju
శ్రీ| Last Modified సోమవారం, 29 జులై 2019 (20:37 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత, యు.వి కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. మోసాలు చేయడం, అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని మండిపడ్డారు కృష్ణం రాజు.

పశ్చిమ గోదావరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు నాలుగేళ్లు మోదీ నుంచి లబ్ది పొంది, అబద్దాలు తప్పుడు ప్రచారం చేసినందుకే నేడు చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు.

దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తోందన్నారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని 2024లో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ
అధికారం చేపడుతుందని కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా పడుతుందని వ్యాఖ్యానించారు.

అబద్దాలు, మోసాలతో ఎక్కువ కాలం గడపలేమని, నిజాయితీ ఉన్నప్పడే ప్రజల గుండెలు గెలుస్తామన్నారు కృష్ణంరాజు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనుల సాధన కోసం ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :