మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2019 (15:26 IST)

ఫినాయిల్ సాయిరెడ్డిగారూ... ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగు చంపేస్తారా?

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు విమర్శలు గుప్పించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన విజయసాయిరెడ్డిని ఫినాయిల్ సాయిరెడ్డిగారూ అంటూ వ్యంగ్యంగా అన్నారు. 
 
విజయసాయి డైరెక్షన్‌లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పాట అందుకున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎందుకింత తెగులు.. తెలుగును విస్మరిస్తారా? అంటూ తెలుగు కోసం పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు ఆయన నాలుకను మడతేసి ఇంగ్లీష్ ఉద్యమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 
 
'మీ ఫినాయిల్ పత్రిక, ఫినాయిల్ బ్యాచ్ రెచ్చిపోయి తెలుగుని చంపేస్తారా? అని రాసిన రాతలు మర్చిపోయారా? అన్నీ మీ డైరెక్షన్‌లోనే నడిచాయి కదా ఫినాయిల్ సాయిరెడ్డిగారూ' అంటూ ట్విట్టర్ వేదికగా బుద్దా వెంకన్న ఘాటైన విమర్శలు చేశారు.