సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:10 IST)

ఓటమి భయంతోనే ఉప ఎన్నికల్లో వైకాపా అరాచకం : అచ్చెన్నాయుడు

తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందన్న భయంతోనే ఆ పార్టీ నేతలు అరాచకానికి పాల్పడ్డారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. 

రాష్ట్ర డీజీపీ పోస్టుమాన్‌ ఉద్యోగం చేస్తున్నారా? వైకాపా నేతలకు గులాంగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్టు చేయకుండా వదిలేస్తారా? అంటూ మండిపడ్డారు. 

మంత్రి పెద్దిరెడ్డి తన కల్యాణ మండపంలో దొంగ ఓట్లు వేయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విప్ దొంగ ఓట్లు వేయడానికి కారణంగా నిలవడం దారుణమని అచ్చెన్నాయుడు అన్నారు.

తేకాకుండా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికీ సీఎం జగన్ చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతోంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శంచారు. 

అదే వస్తుంది.. అదే పోతుంది అనే ధోరణిలో జగన్ ఉన్నారన్నారు. బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, కనీసం సరిగా భోజనం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యాక్సిన్ కొరతపై టీడీపీ తరుపున ప్రధానికి, కేంద్రానికి లేఖ రాస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.