ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (15:08 IST)

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజం : కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్ర కొల్లు రవీంద్ర మరోమారు ఆరోపణలు గుప్పించారు. మాట తప్పడం - మడమ తిప్పడం జగన్ నైజమని, దీన్ని ప్రజలు గుర్తించలేక మోసపోయారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్‌ రెడ్డి లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే బలవంతపు అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. 
 
విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.