ఉపాధ్యాయుడా.. కీచకుడా.. కోరిక తీర్చాలని మహిళను..?

woman victim
woman victim
సెల్వి| Last Updated: సోమవారం, 11 జనవరి 2021 (11:17 IST)
ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన ఉపాధ్యాయడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఒక మహిళను కోరిక తీర్చమంటూ వేదించాడు. ఒక వేళ కోరిక తీర్చకుంటే నీ పిల్లలు నా స్కూల్‌‌లో చదువుతున్నారు. వారి జీవితాన్ని నాశనం చేస్తాను అంటూ బెదిరించాడు. ఈ వేధింపులతో
ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు భరోసాగా మహిళ సంఘాలు కూడా నిలిచాయి. కీచక టీచర్‌ను శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

పోలీసులు బాధితురాలి కథనం ప్రకారం నిమ్మకాయలు అమ్ముకుని జీవితంను గడిపే ఒక మహిళను ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వెంటపడ్డాడు. అతడు ఏకంగా ఇంటికి వెళ్లి ఆమెను లైంగికంగా వేదించడం మొదలు పెట్టాడు. నాకు సహకరించకుంటే నీ అంతు చూస్తా నీ పిల్లల చదువులు ఎలా సాగుతాయో చూస్తాను అంటూ బెదిరించాడు అంటూ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :