వైకాపాలో చేరనందుకే బస్సులు సీజ్​

jc diwakar reddy
ఎం|
వైకాపాలో చేరనందుకే తన ట్రావెల్స్​ బస్సులు సీజ్​ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డి విమర్శించారు. రెండ్రోజుల్లో తన మైనింగ్​ సంస్థలు మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని జేసీ ఆరోపించారు.

వైకాపాలోకి రమ్మని ఆహ్వానించినా వెళ్లకపోవడం వల్లే కక్షగట్టి తన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి పాలన తానెప్పుడూ చూడలేదని తన లాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తన బస్సులు వదలమని ట్రైబ్యునల్​ చెప్పినా.. 15 బస్సులను ఆర్టీఏ అధికారులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. దీనిపై కేసులు వేయబోతున్నట్లు జేసీ తెలిపారు.

చింతమనేని లాంటి వారిపై వరుస కేసులు పెడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జేసీ మండిపడ్డారు. రెండ్రోజుల్లో తన మైనింగ్ సంస్థలు​ మూసివేయించేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని అన్నారు.
దీనిపై మరింత చదవండి :