శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (14:44 IST)

నిమ్స్‌కు అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి .. రిపోర్టులు నార్మల్‌ అయితే..?

YS Bhaskar Reddy
YS Bhaskar Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అరెస్ట్ చేసిన అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ కేసులో చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భాస్కర్ రెడ్డి నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే నిమ్స్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు పురమాయించారు. దీంతో భాస్కర్ రెడ్డిని నిమ్స్‌కి తరలించడం జరిగింది. 
 
నిమ్స్ ఆస్పత్రిలో భాస్కర్ రెడ్డికి గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టులు నార్మల్‌గా ఉంటే భాస్కర్ రెడ్డిని తిరిగి చంచల్‌గూడ జైలుకు పంపించే అవకాశం ఉంది.