శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:45 IST)

గొర్రెలు, పశువులు, పందుల్లా కొంటున్నారు : జగన్ ధ్వజం

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గొర్రెలు, పశువులు, పందుల్లా కొనుగోలు చేస్తున్నారనీ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారానికి 22వ రోజుకు చేరింది.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గొర్రెలు, పశువులు, పందుల్లా కొనుగోలు చేస్తున్నారనీ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారానికి 22వ రోజుకు చేరింది. ఇందులోభాగంగా, కర్నూలు జిల్లా బిలేకల్లులో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. 
 
"ఎమ్మెల్యేలను కొంటే వైసీపీ ఉండదని చంద్రబాబు అనుకుంటున్నారు. 2011లో వైసీపీని ప్రారంభించినప్పుడు వైఎస్‌ కొడుకు జగన్‌, వైఎస్‌ సతీమణి విజయమ్మ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను గెలిపించుకున్న సత్తా మాది'' అని గుర్తు చేస్తున్నారు. కేవలం అమ్ముడు పోయే ఎమ్మెల్యేలను మాత్రమే కొనుగోలు చేయగలరు.. వైకాపా కార్యకర్తలను కాదనీ ఆయన స్పష్టంచేశారు. 
 
రాష్ట్రానికి పెట్టుబడులు కావాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. ప్రత్యేక హోదా ఏకైక మార్గమని.. ఆ హోదాను చంద్రబాబు ప్రధాని మోడీ వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. ప్రశ్నిస్తే ఆడియో.. వీడియో కేసుల్లో బొక్కలో తోస్తారని భయం పట్టుకుందని జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవాచేశారు.