శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (14:58 IST)

ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే కొట్టిన మీరా మాట్లాడేది... నారా రోహిత్

నారా పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌గా మార్చ‌డంలో ముఖ్య‌మంత్రివ‌ర్యులు, మా పెద‌నాన్న శ్రీ చంద్ర‌బాబు నాయుడు గారి కృషి అభినంద‌నీయం. రామ‌ల‌క్ష్మ‌ణుల్లా క‌లిసి ఉండే మా పెదనాన్న‌, మా నాన్న (రామ్మూర్తి నాయుడు) మ‌ధ్య విభేదాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించ‌డం బాధాక‌రం. మీ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అన్న‌ద‌మ్ముల మ‌ధ్య విభేదాలు సృష్టించొద్దు. నారా పేరును నిల‌బెట్ట‌డానికి మా కుటుంబం నుంచి ఒక్క‌రు చాలు. క‌నుక‌నే మేమంతా క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాం. మీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మా కుటుంబంపై మా మ‌ధ్య ఉన్న బంధంపై బుర‌ద చ‌ల్ల‌కండి. 
 
నాలుగు ద‌శాబ్ధాల క్రిత‌మే స‌మాజ అభివృద్ధి కోసం మా ఆస్తుల‌ను పాఠ‌శాల‌ల‌కు, పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు ఇచ్చామ‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోకండి. మాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్ల‌క్ష్యం చేశార‌న్న వాద‌న నూటికి నూరుపాళ్లు అవాస్త‌వం.. అస‌త్యం. రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మించి 5 కోట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను ఏవిధంగా చూసుకుంటున్నారో మమ్మ‌ల్ని అదేవిధంగా చూసుకుంటున్నారు. 
 
ఎంపీ ప‌ద‌వి కోసం సొంత బాబాయి మీద‌నే చేయి చేసుకున్న చ‌రిత్ర వైఎస్ కుటుంబానిది. మాకు ప‌ద‌వులు ముఖ్యం కాదు. మాకు అటువంటి నీచ చ‌రిత్ర అవ‌స‌రం లేదు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధ‌వ్యాల విలువ‌..? ప‌్ర‌తి సంవ‌త్స‌రం మాతో క‌లిసి సంక్రాంతి పండ‌గ జ‌రుపుకుంటున్నారు. ముఖ్య‌మంత్రిలా కాకుండా ఒక కుటుంబ పెద్ద‌గా గ‌డుపుతున్నారు. మా అంద‌రికీ ఇవ్వ‌వ‌ల‌సిన ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు క‌నుక ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు అంటూ నారా రోహిత్ చెప్పారు.