గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:32 IST)

వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 
 
వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి మరో అనుమానిత మహిళను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వివేకాకు వ్యవసాయ పొలం పనులు చూసి జగదీశ్వర్ రెడ్డిని వరుసగా రెండో రోజు విచారణకు పిలిచారు. వీరితోపాటు పులివెందులలో గని యజమాని గంగాధర్ ని కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు సుదీర్ఘ విచారణ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.