బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:32 IST)

శ్రీకాళహస్తిలో కొత్తగా రెండు కరోనా కేసులు-28 రోజులు లాక్ డౌన్

శ్రీకాళహస్తిలో కొత్తగా మరో రెండు పాజిటీవ్ కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే స్థానికంగా మూడు కేసులు నమోదు కాగా అందులో లండన్ నుంచి వచ్చిన యువకుడికి చికిత్స తర్వాత నెగిటీవ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

మరో ఇద్దరు ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త శ్రీకాళహస్తికి చేరుకుని తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. 
 
సోమవారం ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యారు.

శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు లాక్‌ డౌన్‌ను పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ నారాయణ గుప్తా ప్రకటించారు. ఫలితంగా శ్రీకాళహస్తి పట్టణంలో మరో 28 రోజులు లాక్‌ డౌన్‌ను పొడిగించారు.