లాక్‌డౌన్ ఎఫెక్టు : నీలి చిత్రాలను తెగ వీక్షిస్తున్న ఇండియన్స్
కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి మొదలైన 21 రోజుల లాక్‌డౌన్ ఈ నె 14వ తేదీతో ముగియనుంది. దీంతో దేశ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితమమయ్యారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుని పోయారు. ఇది పోర్న్ వెబ్‌సైట్లకు కలిసివచ్చింది. ఈ కాలంలో నీలి చిత్రాలను వీక్షించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయినట్టు ఓ సర్వేలో తేలింది.
ప్రముఖ పోర్న్‌వెబ్‌సైట్ 'పోర్న్ హబ్' తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నీలి చిత్రాల వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ ఒక్క వెబ్‌సైట్‌కో గత 21 రోజుల కాలంలో ఏకంగా 60 శాతం మంది వీక్షకులు పెరిగినట్టు తేలింది.
అన్ని వర్గాల వారికి కోరుకున్నంత ఖాళీ దొరకడంతో ఎప్పటి నుంచో ఉన్న ఈ చిత్రాల వీక్షణ ఆకాంక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే దీనిపై వ్యంగ్యాస్త్రాలు కూడా పలువురు సంధిస్తున్నారు. 'కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కానీ జనభా విస్పోటం వస్తుందేమో' అని సెటైర్లు వేస్తున్నారు.