మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:13 IST)

ఏస్తుక్రీస్తును శిలువ వేసిన రోజు గుడ్‌ఫ్రైడే : మహాత్యాగానికి ప్రతీక అంటున్న సీఎం జగన్

ప్రపంచ వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు శుక్రవారం జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ఉప రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఓ సందేశంలో... "క‌రుణామ‌యుడైన ఏసు ప్ర‌భువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయ‌న పున‌రుజ్జీవించిన ఈస్ట‌ర్ సండే రోజు.. ఈ రెండూ మాన‌వాళి చరిత్ర‌ను మ‌లుపులు తిప్పిన ఘ‌ట్టాలు" అని వ్యాఖ్యానించారు.
 
అలాగే, మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, ఆకాశమంత‌టి స‌హ‌నం, అవ‌ధులు లేని త్యాగం ఇది జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం అని వైఎస్‌ జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
కాగా, క్రైస్తవ పరమాత్ముడు ఏసుక్రీస్తును శిలువలో వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా పరిగణించబడుతోంది. గుడ్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడే ఈ రోజున క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజల్లో పాల్గొంటారు.
 
గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును నిష్టతో పూజిస్తే.. పుణ్య ఫలితాలతో అనుగ్రహిస్తాడని విశ్వాసం. ఇంకా పవిత్ర వారమంతా ఉపవాసముండి ఈస్టర్ విందు తీసుకునే వారికి ఏసుక్రీస్తు సకల భోగభాగ్యాలను ప్రసాదించి, ఈతిబాధలను తొలగిస్తాడని క్రైస్తవ మతస్థుల నమ్మకం.
 
ఏసుక్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను ఈ రోజున క్రైస్తవులు నెమరువేసుకుంటారు. పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున క్రైస్తవులు ప్రార్థనలతో జీసస్‌ను ప్రార్థిస్తారు.
 
క్రీస్తు యొక్క సంహేద్రిన్ ప్రయత్నం గురించి రచించబడిన వివరాల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం ఏడీ 33గా అంచనా వెయ్యబడింది. వాస్తవానికి బైబిలికల్ మరియు జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్‌చే ఏడీ 34 గా చెప్పబడింది.