గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 20 జనవరి 2021 (22:34 IST)

రామతీర్థం విగ్రహాలను ధ్వంసం చేసింది సిఎంకు దగ్గరి బంధువా?

ప్రవీణ్ చక్రవర్తి. ప్రస్తుతం ఇతని పేరే హాట్ టాపిక్. రామతీర్థంలో విగ్రహాలను ధ్వంసం చేయడమే కాదు.. మిగిలిన చాలా హిందూ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రవీణ్ చక్రవర్తి. ఇప్పటివరకు ఇతనెవరో ఎవరికీ తెలియదు. కానీ అతనే స్వయంగా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పడం మాత్రం పెద్ద చర్చకే దారితీసింది.
 
అసలు ఈ ప్రవీణ్ చక్రవర్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారట. బ్రదర్ అనిల్‌కు అత్యంత సన్నిహితుడట ప్రవీణ్ చక్రవర్తి. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఆధారాలను పక్కదారి పట్టిస్తూ ఆలస్యంగా అతని ఇంట్లో సోదాలు చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపిస్తున్నాయి.
 
ఈ విషయాన్ని తిరుపతిలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు అచ్చెంనాయుడు. ఆలయాలపై దాడులు చేయించేది వైసిపి అంటూ అందుకు ఉదాహరణ ఇదేనంటూ చెప్పుకొచ్చారు అచ్చెంనాయుడు. మరి చూడాలి విజయనగరం జిల్లాలోని రామతీర్థం విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో.