మమ్మల్ని రామతీర్థం పంపకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది: విష్ణువర్ధన్ రెడ్డి
చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి వేదికగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందన్నారు. జరగబోయే పరిణామాలకు సిఎం జగన్ నైతిక బాధ్యత వహించాలన్నారు.
రామతీర్థం కొండమీదికి టిడిపి, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. పోలీసులు వైసిపి కండువాలు కప్పుకుని డ్యూటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలీసులకు జీతాలు ఇస్తోంది వైసిపి ఆఫీసా, లేక రాష్ట్రప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు.
ఎపిలో మానవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 60 యేళ్ళ వయస్సున్న సోము వీర్రాజుని అరెస్టు చేయడం జగన్ పిరికిపంద చర్య అన్నారు. ఎపిలో పోలీసుల ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే వరుస సంఘటనలు జరుగుతున్నాయన్నారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.