మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (21:43 IST)

హిందూ సంఘాలపై శ్రీరెడ్డి బూతుపురాణం

శ్రీరెడ్డి మరోసారి విజృంభించింది. ఫేస్ బుక్ లైవ్ వేదికగా హిందూ సంఘాలపై తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది. ఎపిలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇది మానండి అంటూ చెప్పుకొచ్చింది.
 
ఉన్నట్లుండి శ్రీరెడ్డి హిందూ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం రామతీర్థం. ఎపిలోను, తెలంగాణా రాష్ట్రంలోను రామతీర్థం ఘటన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
 
చేతకాని ప్రభుత్వమంటూ జగన్ పైన మండిపడుతున్నాయి. అంతటితో ఆగడం లేదు హిందూ సంఘాలు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఫేస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్ క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు కాబట్టి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు.
 
మీరు అసలు ఒక... అంటూ దారుణమైన పదజాలాన్ని వాడుతూ విమర్సించింది. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ ఇలా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హిందూ సంఘాలు కూడా అదే స్థాయిలో ఆమెకు సమాధానం ఇచ్చాయి. వైసిపి నాయకులకు లేని అభ్యంతరం నీకెందుకమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు.